Kasthuri | తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ సినీ నటి కస్తూరి (Kasthuri)ని చెన్నై పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ కేసులో నటి కస్తూరికి ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో కోర్టు కస్తూరి ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు పోలీసులు కస్తూరిని చెన్నైలోని ఎగ్మోర్ ఫుళల్ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
అంతకుముందు ముందస్తు బెయిల్ కోసం కస్తూరి దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేయడంతో ఆమెను అరెస్టు చేసేందుకు తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే చెన్నైలోని ఆమె ఇంటికి తాళం వేసి ఉండటం, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో తమిళనాడు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కస్తూరిని ఫైనల్‌గా హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి చెన్నై తరలించారు.
రీసెంట్గా తమిళనాడులోని రాజకీయపార్టీ ‘హిందూ మక్కల్ కచ్చి’ ఏర్పాటు చేసిన సభలో కస్తూరి ద్రవిడ పార్టీలనుద్దేశించి మాట్లాడుతూ.. ద్రవిడ పార్టీలు బ్రాహ్మణులను పరాయివాళ్లుగా చూడటం సరికాదంటూ.. తెలుగువారి పట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడులోని రాజుల అంతఃపురంలో పని చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లను తమిళనాడు స్థానికులుగా భావిస్తూ, బ్రాహ్మణులను మాత్రం పరాయి వాళ్లుగా చూడటం ఏంటని కస్తూరి ప్రశ్నించింది.
వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై కస్తూరి వివరణ కూడా ఇస్తూ.. ద్రవిడ పార్టీలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని అన్నారు. తెలుగు ప్రజలను అవమానించడం తన ఉద్దేశం కాదని తెలిపారు. కేవలం బ్రాహ్మణులను పరాయివాళ్లుగా చూడటం ఏంటని ప్రశ్నించానని, అంతేతప్ప తెలుగువారిని కించపర్చలేదని చెప్పుకొచ్చారు.
The Rana Daggubati Show | నాకు ఏం తెలియదు.. ది రానా దగ్గుబాటి షో ట్రైలర్ వచ్చేసింది
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Varun Tej | వరుణ్ తేజ్‌కు ఓజీ డైరెక్టర్ సుజిత్ కథ చెప్పాడట.. కానీ