హైదరాబాద్, మార్చి 5: ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మరో భారీ ప్రాజెక్టును దక్కించుకున్నది. మహారాష్ట్ర ఇండస్ట్రియల్స్ టౌన్షిప్ లిమిటెడ్ నుంచి రూ.1,401.84 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించిందని పేర్కొంది.
ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఢిఘీ పోర్ట్ ఇండస్ట్రియల్ ప్రాంతం-1ను అభివృద్ధి ప్రాజెక్టు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పద్ధతిన ఈ ప్రాజెక్టును నిర్మించాల్సి వుంటుందని కంపెనీ సీఈవో సునీల్ నాయర్ తెలిపారు. ఈ ప్రాజెక్టును వచ్చే 930 రోజుల్లో నిర్మించాల్సి ఉంటుందన్నారు.