Akira Nandan | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్ (Akira Nandan) సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ గురించి సర్వత్రా చర్చ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఓజీతో అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ ఉండబోతుందని వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అకీరానందన్ పాపులర్ రైటర్, మెంటార్ సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకోబోతున్నాడని కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇదిలా ఉంటే అకీరానందన్ ఓజీతో ఇండస్ట్రీకి పరిచయమయ్యేది నిజమేనట. కానీ యాక్టర్‌గా కాదు.. మ్యూజిషియన్‌గా. ఎస్ థమన్ ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. తాజా చిట్‌చాట్‌లో థమన్ మాట్లాడుతూ.. కీ బోర్డు ప్లే చేయడంలో అకీరా మాస్టర్ అని.. తాను త్వరలోనే పవన్ కల్యాణ్ ఓజీ మ్యూజికల్ సెషన్స్‌కు అకీరాను పిలుస్తానన్నాడు.
అకీరా వేళ్లు చాలా పొడవుగా ఉంటాయి. అతడు పర్ఫెక్ట్ పియానిస్ట్‌గా కనిపిస్తాడు. అకీరా నాతో రెండు నెలలు పనిచేశాడని చెప్పుకొచ్చాడు థమన్. ఈ కామెంట్స్‌తో అకీరా ఓజీ సినిమాతో మ్యూజిషియన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది.
Diljit Dosanjh | వాళ్లు ఏం చేసినా అనుమతిస్తారు.. వివాదంపై దిల్జీజ్ దోసాంజ్
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్