Pushpa 2 The Rule | తెలుగు ప్రేక్షకులతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాంచైజీ ప్రాజెక్టులో టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి టైటిల్ రోల్లో సందడి చేయనున్నాడు. ఈ మూవీని 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారని తెలిసిందే.
ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. పవర్ అంటే భయం లేదు.. అంటూ జగపతి బాబు వాయిస్ ఓవర్‌తో మొదలైంది ట్రైలర్. పుష్ప.. పేరు చిన్నది.. కానీ సౌండ్ మాత్రం చాలా పెద్దది.. పుష్ప అంటే పేరు కారు.. బ్రాండ్.. అంటూ సాగుతున్న ట్రైలర్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో 100 మిలియన్ల వ్యూస్‌కుపైగా రాబడుతూ.. రికార్డ్ టైంలో ఈ మైల్ స్టోన్ సాధించిన తొలి భారతీయ సినిమా ట్రైలర్‌గా ట్రెండ్ క్రియేట్ చేసింది.
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్.. అంటూ సీక్వెల్లో స్టన్నింగ్ డైలాగ్స్‌తో పుష్పరాజ్ అదరగొట్టేస్తుండగా.. ఫస్ట్ పార్ట్‌లో పార్టీ లేదా పుష్ప అని అడిగిన భన్వర్ సింగ్ షెకావత్ ఈ సారి మాత్రం పార్టీ ఉంది పుష్ప అంటూ సినిమాపై అంచనాలు అమాంతం చేస్తున్నాడు.
సీక్వెల్లో కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా సందడి చేయనుంది. ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Pushpa Jhukega nahin…
Aur record pe record banana rukega nahin..💥💥The #RecordBreakingPushpa2TRAILER is the fastest Indian Trailer to hit 100 MILLION+ VIEWS ❤️🔥#Pushpa2TheRuleTrailer
▶️ https://t.co/FKXAngle5q#Pushpa2TheRule#Pushpa2TheRuleOnDec5thIcon Star @alluarjun… pic.twitter.com/GfC6fHejOy
— Pushpa (@PushpaMovie) November 18, 2024
పుష్ప 2 ది రూల్ ట్రైలర్..
Kannappa | మహదేవ్ శాస్త్రిగా మోహన్ బాబు.. కన్నప్ప ప్రీ లుక్ వైరల్
Pushpa 2 The Rule trailer | ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది