Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తోన్న తాజా చిత్రం తండేల్ (Thandel). రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీని 2025 ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
కొత్త అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు ఫస్ట్ సింగిల్ ఎప్పుడో చెప్పేశారు మేకర్స్. బుజ్జి తల్లి అంటే తండేల్ రాజుకి అమితమైన ప్రేమ. లవ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ బుజ్జి తల్లిని ఈ నెల 21న విడుదల చేస్తున్నామని ప్రకటిస్తూ లుక్ విడుదల చేశారు. సాయిపల్లవి, చైతూ లవ్ జర్నీతో పాట ఉండబోతున్నట్టు లుక్ చెప్పకనే చెబుతోంది.
ప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి.. అంటూ తీరపు అలల మధ్య సాయిపల్లవి, నాగచైతన్య ఎమోషనల్‌గా ఒకరికొకరు హగ్ చేసుకున్న స్టిల్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై హైప్ పెంచేస్తుంది.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Thandel Raju’s adoring love for his #BujjiThalli will be ‘The Love Song of the Year’ 💕#Thandel First Single #BujjiThalli out on November 21st 🫶#ThandelonFeb7th#Dhullakotteyala
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts #AlluAravind… pic.twitter.com/7oCaPGRMz1— Geetha Arts (@GeethaArts) November 18, 2024
Kannappa | మహదేవ్ శాస్త్రిగా మోహన్ బాబు.. కన్నప్ప ప్రీ లుక్ వైరల్
Pushpa 2 The Rule trailer | ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది
Akira Nandan | ఓజీతోనే అకీరానందన్ ఎంట్రీ.. ఎస్ థమన్ క్లారిటీ ఇచ్చేసినట్టే..!