Mirai | హనుమాన్ ఫేం తేజసజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా అడ్వెంచరస్ మూవీ మిరాయి (Mirai). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఢిల్లీ సుందరి రితికా నాయక్ (Ritika Nayak) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మంచు మనోజ్ (Manchu Manoj) కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ ప్రాజెక్టులో మరో టాలెంటెడ్ యాక్టర్ భాగం కాబోతున్నాడట.
తాజా టాక్ ప్రకారం మిరాయిలో బాహుబలి యాక్టర్ రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్త బయటకు వచ్చింది. త్వరలోనే రానాకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారని ఇన్ సైడ్ టాక్. రానా ఎంట్రీపై మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేయనున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే మరి కార్తీక్ దండు భళ్లాల దేవుడిని ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్‌లో మెరువనుందని తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన మంచు మనోజ్ మిరాయి లుక్ సినిమాపై హైప్ పెంచుతోంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. గౌరా హరి సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2025 ఏప్రిల్ 18న 2డీ, 3డీ వెర్షన్లలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన మిరాయి టైటిల్ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.
Kannappa | మహదేవ్ శాస్త్రిగా మోహన్ బాబు.. కన్నప్ప ప్రీ లుక్ వైరల్
Pushpa 2 The Rule trailer | ఎవడ్రా వాడు.. డబ్బంటే లెక్కలేదు.. అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది
Akira Nandan | ఓజీతోనే అకీరానందన్ ఎంట్రీ.. ఎస్ థమన్ క్లారిటీ ఇచ్చేసినట్టే..!