సాగునీటి కోసం రైతుల ఆందోళన
వేసవి రాకముందే రైతులకు సాగునీటి కష్టా లు ప్రారంభమయ్యా యి. సాగునీటిని నమ్ముకొని పంటలను సాగుచేసుకున్న రైతులు వా టికి సక్రమంగా నీరందించలేకపోవడంతో ఎండుతు న్న పంటలను చూసి ఆ గ్రహం వ్య క్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కాల్వ ద్వారా సరఫరా అవుతున్న నీరు తగ్గుముఖం పట్టడంతో ఆయా రైతులు సాగు చేసిన వరి, మొక్కజొన్న, పల్లి వంటి పంటలు ఎండుతున్నాయి.
- పంటలు ఎండిపోతున్నాయని మండిపాటు
- వేధిస్తున్న ఎరువుల కొరత, నీటి కొరత
- అధికారులతో రైతుల వాగ్వాదం
- ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డికి విన్నవించినా ఫలితం శూన్యం
నాగర్‌కర్నూ ల్, మార్చి 10: వేసవి రాకముందే రైతులకు సాగునీటి కష్టా లు ప్రారంభమయ్యా యి. సాగునీటిని నమ్ముకొని పంటలను సాగుచేసుకున్న రైతులు వా టికి సక్రమంగా నీరందించలేకపోవడంతో ఎండుతు న్న పంటలను చూసి ఆ గ్రహం వ్య క్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కాల్వ ద్వారా సరఫరా అవుతున్న నీరు తగ్గుముఖం పట్టడంతో ఆయా రైతులు సాగు చేసిన వరి, మొక్కజొన్న, పల్లి వంటి పంటలు ఎండుతున్నాయి. దీంతో మండలంలోని తూడుకుర్తి, శ్రీపురం, బొందలపల్లి, వనపట్ల, నల్లవెల్లి, ఉయ్యాలవాడతోపాటు బిజినేపల్లి మండలం ఖానాపూర్, వడ్డెమాన్ గ్రామాల రైతు లు సల్కర్‌పేట సమీపంలో ఉన్న బైకెనాల్ కాలువ వద్ద ఆందోళన కు దిగారు.
వేలాది రూపాయలు వెచ్చించి పంటలు సాగుచేశామని, కోతకు వచ్చే సమయంలో సరైన నీరు అందక పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో అక్కడికి వచ్చిన అధికారులతో రైతులు వాగ్వివాదానికి దిగారు. చుట్టుపక్కల గ్రామా ల రైతులకు నీరు అందించకుండా కల్వకుర్తి ప్రాంతానికి నీటిని తరలించేందుకు తమ కాల్వకు అధికారులు అడ్డుకట్ట వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలకు నీరు తక్కువగా వస్తుందని ఎమ్మెల్యే రా జేశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు.
అధికారులకు ఏం చెప్పారో కాని కావాలనే తమను సాగునీటి విషయంలో అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పంటకు నీరు అం దకపోవడం, మరోవైపు యూరియాకోసం పంపి ణీ సెంటర్ల చుట్టూ తిరిగేందుకే సరిపోతుందన్నారు. ఎప్పుడు స్టాక్ వస్తుందో ఎప్పు డు అయిపోతుందో తెలియడం లేదని, ప్రభు త్వం తెచ్చిన యాప్‌లో ఎప్పుడు చూసినా నో స్టాక్ అన్నట్లుగానే కనిపిస్తుందన్నారు. అటు యూరియా దొరకక ఇటు నీరు అందక అన్ని కష్టాలే పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నాగర్‌కర్నూల్, బిజినేపల్లి మండలాల్లోని గ్రామాల రైతుల పంట పొలాల మీదుగా ఉన్న చిన్న కాల్వను కాకుం డా కల్వకుర్తి, వనపర్తి, ఉప్పునుంతల వంటి ప్రాంతాలకు పెద్ద కాల్వలకు నీటిని ఎక్కువ మొత్తంలో వదిలిపెట్టడంతో తమ పంటలకు సక్రమంగా నీరు అందక ఎండిపోతున్నాయన్నారు. అప్పులు చేసి పం టలు సాగు చేసుకున్నామని, కోతకు వచ్చే సమయంలో సాగునీటికి ఇబ్బందులు పెట్ట డం సరికాదన్నారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన అధికారులు నచ్చజెప్పడంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

