Mechanic Rocky | టాలీవుడ్ యాక్టర్ విశ్వక్సేన్ (Vishwak Sen) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం మెకానిక్ రాకీ (Mechanic Rocky). విశ్వక్ సేన్ 10 (VS 10)గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నవంబర్ 22న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేశారు. అతన్ని తక్కువ అంచనా వేయొద్దు.. వాడు మెకానిక్.. ఇంజినీర్ కాదు.. ప్రపంచాన్ని కొంచెం చూసి ఉంటాడు.. అంటూ విశ్వక్ సేన్ క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేసే సన్నివేశాలతో సాగుతున్న రిలీజ్ ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేస్తుంది. మనకు షేపవుట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసంటున్నాడు మెకానిక్ రాకీ.
ఇప్పటికే లాంచ్ చేసిన గుల్లెడు గుల్లెడు సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా.. నరేశ్, వైవా హర్ష, హర్షవర్ధన్, రఘురామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి తెరకెక్కిస్తున్నారు.
మెకానిక్ రాకీ రిలీజ్ ట్రైలర్..
High Voltage 🔥 #MechanicRocky 2.0 Trailer Out Now #MechanicRockyTrailer #VishwakSen pic.twitter.com/0A394bHHjL
— BA Raju’s Team (@baraju_SuperHit) November 19, 2024
మెకానిక్ రాకీ ట్రైలర్..
Mr Bachchan | మిస్టర్ బచ్చన్ వచ్చేస్తున్నాడు.. రవితేజ మూవీ టీవీల్లోనైనా ఇంప్రెస్ చేసేనా..?
Kantara Chapter 1 | అఫీషియల్.. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ -1 రిలీజ్ డేట్ వచ్చేసింది