Vishwambhara | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్‌కు బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా విశ్వంభర షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి టీం జపాన్‌లో ఉంది. తాజా టాక్ ప్రకారం చిరంజీవి, త్రిషపై వచ్చే సాంగ్ చిత్రీకరిస్తుండగా.. నవంబర్ 21న చిరంజీవి టీం హైదరాబాద్‌కు తిరిగి రానుందట. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ అభిమానులను నిరాశపర్చగా.. ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా వీఎఫ్ఎక్స్ క్వాలిటీని పెంచే పనిలో ఉందని ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తుండగా.. ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. సినిమాపై క్యూరియాసిటీతోపాటు సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
విశ్వంభర కాన్సెప్ట్ వీడియో..
Pushpa 2 The Rule | పుష్ప 2 ది రూల్ రిలీజ్ ఆన్ ది వే.. తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్..!