Reviews | ఇటీవల కాలంలో థియేటర్ల ముందు యూట్యూబ్ ఛానళ్లు, కొందరు నెటిజన్లు రివ్యూ (Reviews)లు ఇవ్వడం ఎక్కువైపోయిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ హడావుడి రివ్యూలు సినిమా ఫలితంపై ప్రభావం చూపిస్తున్నాయని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA) అభిప్రాయపడింది. ఇలాంటి రివ్యూలను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
సినిమా సమీక్ష పేరుతో వ్యక్తిగత దాడులు.. విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని TFAPA ఖండిస్తూ.. సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేసింది. రివ్యూలు ఈ ఏడాది విడుదలైన చాలా సినిమాలపై ప్రభావం చూపించాయి. వీటిలో ప్రముఖంగా ఇండియన్ 2, వెట్టైయాన్, కంగువపై పబ్లిక్ టాక్, యూట్యూబ్ ఛానెళ్లు ఇచ్చే విశ్లేషణలు ఎంతో ప్రభావం చూపించాయి.
సినీ పరిశ్రమకు తలనొప్పిగా మారుతున్న ఈ సమస్యను నివారించేందుకు అన్ని సంఘాలు కలిసి రావాలి. థియేటటర్ యజమానులు యూట్యూబ్ ఛానెళ్లను సినిమా థియేటర్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదు. ఫస్ట్ డే.. ఫస్ట్ షో సమయంలో థియేటర్ల వద్ద పబ్లిక్ రివ్యూలను అనుమతించవద్దు. రివ్యూల పేరుతో నటీనటులు, దర్శకనిర్మాతలపై వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నాం. ఇకపై ఇలాంటివి చేస్తే ఒప్పుకునేది లేదని TFAPA హెచ్చరించింది.
திரைப்பட விமர்சனம் என்கிற பெயரில் தனிமனித தாக்குதல் மற்றும் வன்மத்தை விதைத்தல் – #TFAPA கண்டனம்@tfapatn @offBharathiraja @TGThyagarajan @TSivaAmma @Dhananjayang @prabhu_sr #SSLalitKumar @sureshkamatchi pic.twitter.com/rAnYUoH9t7
— Nikil Murukan (@onlynikil) November 20, 2024
AR Rahman: భార్య సైరాకు బ్రేకప్ చెప్పిన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్
Bacchala Malli | ఆ తేదీనే బచ్చలమల్లి.. అల్లరి నరేశ్ రిలీజ్ లుక్ వచ్చేసింది
Pushpa 2 The Rule | పుష్ప 2 ది రూల్ రిలీజ్ ఆన్ ది వే.. తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్..!