Gautam Gambhir : నరేంద్రమోడీ స్టేడియంలో పంజా విసిరిన భారత జట్టు(Team India) వరుసగా రెండోసారి టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. సంచలన ఆటతో తొలిసారి పొట్టి కప్‌ను ఒడిసిపట్టాలనుకున్న న్యూజిలాండ్ కలల్ని కల్లలు చేసిన టీమిండియా.. మూడో కప్‌ను ముద్దాడింది. స్వదేశంలో మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్ చేజారిన బాధను మరిపించే విజయంతో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)సేన ట్రోఫీని కొల్లగొట్టింది. ఈ విజయంలో ఆటగాళ్ల కష్టంతో పాటు ప్రధాన కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) పాత్ర కూడా ఎనలేనిది. ప్రయోగాల పేరుతో జట్టును నాశనం చేస్తున్నాడని అతడిని విమర్శించిన వాళ్లే ఇప్పుడు నువ్వు గొప్ప కోచ్.. జట్టును ఛాంపియన్‌గా తీర్చిదిద్దావు అని పొగుడుతున్నారు.
సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగి అదిరే ఆటతో పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఐసీసీ ఫైనల్లో మెరుగైన రికార్డున్న న్యూజిలాండ్‌ను భారత జట్టు 96 పరుగుల తేడాతో చిత్తు చేసి కప్‌ను పట్టేసింది. ఇంతటి విజయంలో ఆటగాళ్ల కృషి ఎంతుందో.. కోచ్ గంభీర్ కష్టం కూడా అంతే ఉందని చెప్పాలి. రెండేళ్ల క్రితం రాహుల్ ద్రవిడ్ వారసుడిగా భారత కోచింగ్ పగ్గాలు చేపట్టిన గౌతీ.. ప్రయోగాలతో విమర్శలపాలయ్యాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్.. టెస్టు సిరీస్‌ను 2-0తో దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ గంభీర్ కోచింగ్‌కు పరీక్షలా నిలిచింది.
T20 WC 2007: SF & Final
ODI WC 2011: QF, SF & Final
CT 2025: SF & Final
T20 WC 2026: SF & Final (and a virtual QF)Gautam Gambhir, both as player & coach, has never lost an ICC knockout in his career. pic.twitter.com/5wpFY5WYJI
— ESPNcricinfo (@ESPNcricinfo) March 9, 2026
వస్తూనే సీనియర్లను పక్కన పెట్టేసి కుర్రాళ్లను సానబెడుతూ వచ్చిన అతడు.. ప్రపంచకప్‌లో ఫలితాలు చవిచూశాడు. ఇంకేముంది.. ఇన్నాళ్లుగా మనోడిని తిట్టిన నోళ్లతోనే ప్రశంసలు అందుకుంటున్నాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌ను 96 పరుగులతో మట్టి కరిపించిన భారత్ మూడోసారి పొట్టి కప్‌ను కొల్లగొట్టింది. కోచ్‌గా నిరుడు ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ అందించిన గంభీర్ తొలి ఐసీసీ ట్రోఫీని దేశానికి కట్టబెట్టాడు. ఇప్పటికే ఆటగాడిగా ఈ దిగ్గజం రెండు వరల్డ్‌కప్‌లు గెలుపొందిన విషయం తెలిసిందే. ఎంఎస్ ధోనీ సారథ్యంలో 2007లో టీ20 వరల్డ్‌కప్.. తిరిగి 2011లో ధోనీ నాయకత్వంలోనే వన్డే ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టులో గౌతీ సభ్యుడు కావడం విశేషం.
2024 🏆
2026 🏆First team to successfully defend an ICC Men’s T20 World Cup title ✅
The reign continues for #TeamIndia 👑#T20WorldCup | #MenInBlue | #Final pic.twitter.com/gmIr5we67Q
— BCCI (@BCCI) March 8, 2026
తొలి సీజన్ పొట్టి ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై అర్ధ శతకంతో రాణించిన అతడు.. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై మెరుపు అర్ధ శతకంతో భారత్ విజయంలో కీలకమయ్యాడు. అందుకే గంభీర్‌ను ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నమెంట్లలో లక్కీ హ్యాండ్‌గా పేర్కొంటున్నారు కొందరు. ఐపీఎల్‌లోనూ.. కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన అతడు.. మెంటర్‌గా మరో ట్రోఫీని అందించిన విషయం తెఇసిందే.