తిరువనంతపురం: ప్రఖ్యాత చరిత్రకారుడు, విద్యావేత్త కేఎన్ పాణిక్కర్( KN Panikkar) కన్నుమూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. దేశంలోని ప్రముఖ మార్కిస్టు చరిత్రకారుడిగా ఆయనకు గుర్తింపు ఉన్నది. తిరువనంతపురంలోని ఎస్యూటీ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆధునిక భారత చరిత్ర, కమ్యూనలిజం, బ్రిటీష్ పాలన గురించి ఆయన అనేక రచనలు చేశారు. దశాబ్ధాల చరిత్ర, సంస్కృతి గురించి ఆయన అనేక పబ్లిక్ డిబేట్స్‌లో పాల్గొని మాట్లాడేవారు.కేరళలోని కాలడిలో ఉన్న శ్రీ శంకరాచార్య సంస్కృత యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్‌గా చేశారు. కేరళ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్‌గా చేశారు. 1936 ఏప్రిల్ 26వ తేదీన ఆయన జన్మించారు. దేశంలో తీవ్రమైన రాజకీయ, సామాజిక మార్పు జరుగుతున్న సమయంలో ఆయన ఎదిగారు. విక్టోరియా కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత రాజస్థాన్ యూనివర్సిటీలో చదివారు. చరిత్రకారుడిగా, టీచర్‌గా, రచయితగా ఆయన తన కెరీర్‌ను నిర్మించుకున్నారు. మార్కిస్టు భావజాలాన్ని ఆయన ఎక్కువ అధ్యయనం చేశారు. ఢిల్లీలోని జేఎన్‌యూ వర్సిటీలోని చరిత్ర శాఖలో పాణిక్కర్ విద్యను బోధించారు. ఆ తర్వాత ఆయన డిపార్ట్మెంట్ అధిపతిగా చేశారు. స్కూల్ ఆఫ్ సొషల్ సైన్సెస్ డీన్‌గా, ఆర్కీవ్స్ ఆఫ్ కాంటెంపరరీ హిస్టరీ చైర్మెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. విదేశాల్లోని అనేక వర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా చేశారు.