Operation Muskaan-XII | ఆపరేషన్ ముస్కాన్-12లో 6,307 మంది చిన్నారుల రక్షణ
Operation Muskaan-XII | తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-12లో రాష్ట్రవ్యాప్తంగా 124 సబ్‌డివిజన్ పోలీసు బృందాల్లో 620 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముందస్తుగా ఎస్ఓపీలు, చట్టాలపై శిక్షణ ఇచ్చి, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, నిర్మాణ ప్రదేశాలు, టీ దుకాణాలు వంటి బాల కార్మికులు ఎక్కువగా కనిపించే ప్రాంతాలను గుర్తించి తనిఖీలు నిర్వహించారు.
Operation Muskaan-XII | హైదరాబాద్, ఆగస్టు 01 : బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలనకు తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-12లో రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను రక్షించారు. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక, వైద్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేశాయని మహిళా భద్రత విభాగం డైరెక్టర్ చారు సిన్హా తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 124 సబ్‌డివిజన్ పోలీసు బృందాల్లో 620 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ముందస్తుగా ఎస్ఓపీలు, చట్టాలపై శిక్షణ ఇచ్చి, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, నిర్మాణ ప్రదేశాలు, టీ దుకాణాలు వంటి బాల కార్మికులు ఎక్కువగా కనిపించే ప్రాంతాలను గుర్తించి తనిఖీలు నిర్వహించారు.
ఆపరేషన్‌లో రక్షించిన 6,307 మంది చిన్నారుల్లో 5,892 మంది బాలురు, 415 మంది బాలికలు ఉన్నారు. వీరిలో 3,447 మంది తెలంగాణకు చెందినవారు కాగా, 2,860 మంది ఇతర రాష్ట్రాలు, నేపాల్‌కు చెందినవారు. మొత్తం 5,041 మంది బాల కార్మికులు, ఒక బానిస కార్మికుడు, 647 మంది వీధి బాలలు, 43 మంది భిక్షాటన చేస్తున్న చిన్నారులు, 11 మంది ఇంటి నుంచి పారిపోయిన చిన్నారులు, డ్రాప్అవుట్లు, బాల్య వివాహాలు, అక్రమ దత్తత వంటి ఇతర విభాగాల్లో 563 మంది చిన్నారులను గుర్తించి రక్షించారు.
570 మందిని బాలల సంరక్షణ కేంద్రాలకు..
ఈ ఆపరేషన్ సందర్భంగా 1,705 కేసులు నమోదు చేసి, 1,710 మందిని అరెస్టు చేశారు. ఈ కేసుల్లో 1,989 మంది చిన్నారులను రక్షించారు. కార్మిక శాఖ 1,381 తనిఖీ నివేదికలు జారీ చేయగా, కనీస వేతనాల చట్టం కింద రూ.37.95 లక్షల జరిమానాలు విధించింది. రక్షించిన చిన్నారుల్లో 5,737 మందిని కుటుంబాలకు అప్పగించగా, 570 మందిని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు.
హోటళ్లు, ఢాబాలు, వీధి వ్యాపారాలు, నిర్మాణ రంగం, కిరాణా దుకాణాలు, ఆటోమొబైల్ రంగం, మాంసం దుకాణాలు, ఇటుక బట్టీలు, వెల్డింగ్ వర్క్‌షాపులు, బేకరీలు, పాదరక్షల దుకాణాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ షాపులతో పాటు పాఠశాల మానేసిన చిన్నారులను కూడా గుర్తించి రక్షించినట్లు చారుసిన్హా తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా, బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనలో అన్ని శాఖల సమన్వయంతో తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని మహిళా భద్రత విభాగం డైరెక్టర్ చారు సిన్హా పేర్కొన్నారు.
Read Also :
Watch: పెళ్లి కోసం ఒత్తిడి చేసిన ప్రియురాలు.. బైక్‌తో ఈడ్చుకెళ్లిన వ్యక్తి
Watch: రైతుల నిరసన సందర్భంగా.. ధైర్యంగా బస్సు ముందు నిల్చొన్న మహిళా పోలీస్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

