Amarnath Yatra | మళ్లీ ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర.. బల్తాల్ మార్గం నుంచి మాత్రమే అనుమతి
Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర శనివారం తిరిగి ప్రారంభమైంది. వాతావరణం అనుకూలించడంతో బల్తాల్ మార్గంలో యాత్రను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గత నెలలో ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది.
Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర శనివారం తిరిగి ప్రారంభమైంది. వాతావరణం అనుకూలించడంతో బల్తాల్ మార్గంలో యాత్రను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గత నెలలో ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. అయితే, భారీ వర్షాలు, రోడ్లు దెబ్బతినడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వంటి కారణాల వల్ల యాత్రను శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ, శనివారం వర్షాలు తగ్గడం, వాతావరణం అనుకూలంగా ఉండటంతో యాత్రను తిరిగి ప్రారంభించారు.
ఇదే సమయంలో రోడ్లకు కూడా మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం బల్తాల్ మార్గంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభమైందని, భక్తులను పవిత్ర మంచులింగాన్ని దర్శించుకునేందుకు అనుమతిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అయితే, పహల్గాం మార్గం నుంచి సాగే యాత్రను అధికారులు ఇంకా నిలిపివేశారు. ఈ మార్గంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం, రోడ్ల మరమ్మతు పనులు సాగుతుండటంతో ప్రస్తుతానికి యాత్రను నిలిపివేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల జమ్మూ-శ్రీనగర్ హైవేను అధికారులు మూసివేశారు. ఇది 250 కిలోమీటర్ల దూరం కలిగిన జాతీయ రహదారి. కాశ్మీర్ను, దేశమంతా కలిపి ఉంచే రహదారి ఇదే.
ఈ రోడ్డు మార్గం దెబ్బతినడంతో భాగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి వెళ్లాల్సిన భక్తుల్ని కూడా అనుమతించడం లేదు. ఇంకా అక్కడి అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత నెల 3న ఈ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు 4,50,000 మంది భక్తులు పవిత్ర గుహలోని మంచులింగాన్ని దర్శించుకున్నారు. ప్రతి ఏడాదికోసారి సాగే అమర్నాథ్ యాత్ర ఈ నెల చివరి వరకు కొనసాగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

