Aadhaar Authentication | ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిసరి.. లేదంటే వంటగ్యాస్ సబ్సిడీ కట్
Aadhaar Authentication | ఆరు గ్యారెంటీల్లో భాగంగా రాష్ట్రంలోని పేద కుటుంబాలకు సబ్సిడీపై రూ.500కే వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నది.
Aadhaar Authentication | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీల్లో భాగంగా రాష్ట్రంలోని పేద కుటుంబాలకు సబ్సిడీపై రూ.500కే వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు మరో ఎత్తుగడ వేసింది. ఆధార్ అథెంటికేషన్ ఉన్న వినియోగదారులకే రాయితీ వర్తిస్తుందని మెలిక పెట్టింది. గుట్టుచప్పుడు కాకుండా జూలై నుంచే సబ్సిడీ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడం లేదని తెలుస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలమంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తూతూ మంత్రంగా అమలు
సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పథకానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం వివిధ కారణాలను సాకుగా చూపి లబ్ధిదారుల సంఖ్యను సగానికిపైగా తగ్గించింది. ప్రస్తుతం 42.90 లక్షల మందికే సబ్సిడీ వర్తింపజేస్తున్నది. వారిలో కేవలం 20 లక్షల మందికి మించి సబ్సిడీ నగదు జమకావడంలేదన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై ఎంపీడీవోలను అడిగితే గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించాలంటూ చేతులు దులిపేసుకుంటున్నారని, గ్యాస్ ఏజెన్సీలను సంప్రదిస్తే తమకేమీ తెలియదంటున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలోని దరఖాస్తుదారుల్లో 18% మందికే రాయితీపై సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. మిగిలిన 82% మందికి మొండిచెయ్యి చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తున్నది.
కొత్త రేషన్‌కార్డులకు వర్తింపు ఎప్పుడో?
రాష్ట్ర ప్రభుత్వం నిరుడు జనవరి నుంచి ఈ ఏడాది జూలై వరకు కొత్తగా 11.27 లక్షల మందికి రేషన్‌కార్డులు మంజూరు చేసింది. వీరిలో 5 లక్షల మందిని సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించింది. కానీ, వీరికి ఎప్పటి నుంచి సబ్సిడీ వర్తింపజేస్తుందో తెలియడం లేదు. ఇప్పటికే తూతూ మంత్రంగా సబ్సిడీ గ్యాస్ స్కీమ్‌ను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త రేషన్‌కార్డుదారులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తుందా అన్నది అనుమానాస్పదంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

