కరీంనగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున లేడీ గెటప్‌లో వచ్చిన దుండగులు రెండు ఎస్బీఐ ఏంటీఎంలలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. మొదట తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ ఏటీఎంలో చొరబడిన దుండగులు గ్యాస్ కట్టర్‌తో సెన్సార్లు కట్ చేసి రూ. 7లక్షల 13 వేల 400 ఎత్తు కెళ్లారు.
అక్కడి నుంచి రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్‌లో ఎస్బీఐ ఏటీఎంలో రూ.8,85,100 ఎత్తు కెళ్లారు. అనంతరం పెద్దపల్లి వైపు దుండగులు వాహనంలో వెళ్లిపోయారని పోలీసులు భావిస్తున్నారు. అదనపు డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ రెండు ఏటీఎంలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.