60ల్లో ఈ లాభాలు తెలుసా?
దేశంలో 60 ఏండ్లు దాటితే వారి క్రియాశీల సంపాదనకు తెరపడినట్టేనన్నది అందరి భావన. అయితే ఆ తర్వాతే సీనియర్ సిటిజన్లకు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలుంటాయన్నది మీకు తెలుసా? అవును.. అధిక వడ్డీరేట్ల దగ్గర్నుంచి పన్ను రాయితీలదాకా, ప్రయాణాలపై డిస్కౌంట్ల నుంచి యుటిలిటీస్ బెనిఫిట్స్ వరకు రిటైర్మెంట్ ఫైనాన్స్‌కు అన్నీ దన్నుగా నిలుస్తాయి మరి.
- సీనియర్ సిటిజన్లకున్న ఆర్థిక ప్రయోజనాలివి..
దేశంలో 60 ఏండ్లు దాటితే వారి క్రియాశీల సంపాదనకు తెరపడినట్టేనన్నది అందరి భావన. అయితే ఆ తర్వాతే సీనియర్ సిటిజన్లకు ఎన్నో ఆర్థిక ప్రయోజనాలుంటాయన్నది మీకు తెలుసా? అవును.. అధిక వడ్డీరేట్ల దగ్గర్నుంచి పన్ను రాయితీలదాకా, ప్రయాణాలపై డిస్కౌంట్ల నుంచి యుటిలిటీస్ బెనిఫిట్స్ వరకు రిటైర్మెంట్ ఫైనాన్స్‌కు అన్నీ దన్నుగా నిలుస్తాయి మరి.
అధిక రాబడులు
ఆరు పదుల వయసులోకి వచ్చాక అందరికీ తక్షణమే దక్కే లాభం.. రిస్క్ తక్కువ పెట్టుబడుల్లో ఒకటైన ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై అధిక వడ్డీరేట్లు. కమర్షియల్ బ్యాంకులు, పోస్టాఫీసులు.. సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై అదనంగా 0.25 శాతం నుంచి 0.75 శాతం వరకు ఎక్కువగా వడ్డీరేటును చెల్లిస్తాయి. అంతేగాక కేంద్ర ప్రభుత్వపు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో త్రైమాసిక చెల్లింపులతో 8.2 శాతం వార్షిక వడ్డీరేటును పొందవచ్చు. రూ.30 లక్షలదాకా పెట్టుబడికి వీలుంటుంది. గరిష్ఠ పెట్టుబడిపై 3 నెలలకోసారి రూ.61,500 లేదా ఏటా రూ.2.46 లక్షల రాబడుల్ని అందుకోవచ్చు.
పన్ను మినహాయింపులు
పాత ఆదాయ పన్ను (ఐటీ) విధానం కింద సీనియర్ సిటిజన్లకు మరిన్ని మినహాయింపులు లభిస్తాయి. సెక్షన్ 126 (80డీ)తో వ్యక్తిగత ఆరోగ్య బీమా ప్రీమియంలపై రూ.50,000 వరకు ఐటీ కోతకు వీలుంటుంది. 60 ఏండ్లలోపున్నవారికి ఈ ప్రయోజనం రూ.25,000. అలాగే సెక్షన్ 80టీటీబీ కింద డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక కొత్త ఐటీ విధానంలో సెక్షన్ 87ఏ కింద అందరికీ వార్షిక ఆదాయం రూ.12 లక్షలదాకా ఉన్నా.. ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్న విషయం తెలిసిందే. అయితే మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ నుంచి ఆదాయం వచ్చేవారు పన్నుల చెల్లింపుపై ఓ తుది నిర్ణయానికి రావడానికి ముందే పాత, కొత్త ఐటీ విధానాల్లో ఎంతెంత? చెల్లించాల్సి వస్తున్నది అన్నది తెలుసుకోవడం శ్రేయస్కరం అని ఆర్థిక నిపుణులు హితవు పలుకుతున్నారు.
చివరగా..
దేశంలో ప్రైవేట్ రంగ ఉద్యోగులు తప్పక రిటైర్మెంట్ ఫండ్‌ను నిర్మించుకోవాలి. తక్కువ వయసు నుంచే దీనికి ప్రాధాన్యత ఇస్తే.. చివరకు పెద్ద ఎత్తున నిధులు జమవుతాయి. 20, 30ల్లోనే రిటైర్మెంట్ కోసం జీతంలో 10-20 శాతం పక్కన పెట్టాలని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ప్రీతీ జెండే అంటున్నారు. మల్టీ-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్లతోపాటు లార్జ్, మిడ్, స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌ల ద్వారా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు దిగవచ్చు. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), స్వచ్చంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వంటి పన్ను ప్రయోజనాలుండే రుణ సాధనాల్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ ఆధారిత పెట్టుబడులు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయి. కాబట్టి మార్కెట్ నిపుణుల సహాయంతో పెట్టుబడులకు ముందుకెళ్తే మరింత ఆకర్షణీయ రాబడులను పొందవచ్చు.
- 65 ఏండ్లు దాటిన కస్టమర్లకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ రిజిస్ట్రేషన్‌లో ప్రాధాన్యతనిస్తున్నది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ చార్జీలను రద్దు చేస్తున్నది. ల్యాండ్‌లైన్ ఇన్స్టాలేషన్, నెలవారీ సర్వీస్ చార్జీలపై ఎంటీఎన్ఎల్ 25 శాతం రాయితీ ఇస్తున్నది.
- ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో రాయితీలను కల్పిస్తున్నాయి. ఉదాహరణకు 60 ఏండ్లు దాటినవారికి మహారాష్ట్ర ఎంఎస్ఆర్టీసీ బస్సు చార్జీల్లో 50 శాతం తగ్గింపునిస్తున్నది. 75 ఏండ్లు దాటితే ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది.
- కొన్ని భారతీయ ఎయిర్‌లైన్స్ కనీస చార్జీలపై వివిధ దేశీయ మార్గాల్లో 25 శాతం తగ్గింపును అందిస్తున్నాయి.
- భారతీయ రైల్వేలు టికెట్ బుకింగ్స్‌పై పలు ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని కోచ్‌లలో లోయర్-బెర్త్ కోటాలను అందిస్తున్నాయి.
- వివిధ రాష్ర్టాల్లో వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయి. వివిధ సేవల్లో సీనియర్ సిటిజన్లకు వేగవంతమైన సర్వీసులను అందిస్తున్నాయి.
దేశంలో ప్రభుత్వ పింఛన్లు ప్రైవేట్ రంగ శ్రామికులకు వర్తించవు. ఆకర్షణీయ రాబడులు, పన్ను ప్రోత్సాహకాలు, సరళతర పరిపాలనా విధానాలు, ఆరోగ్య బీమా ప్రయోజనాల ద్వారా ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు చేయూతనిస్తుంది.
– ఆదర్శ్ నరహరి, ప్రైమస్ సీనియర్ లివింగ్ అండ్ మర్జీ వ్యవస్థాపక ఎండీ
సురక్షిత పెట్టుబడులపై అధిక వడ్డీరేట్లు అందుకోవడం పదవీ విరమణ వయసులో బాగా కలిసొచ్చే అంశం. అన్ని అంశాల్లో ప్రాధాన్యత, రవాణాపరమైన రాయితీలూ చెప్పుకోదగ్గవే.
– భాస్కర్ నెరుర్కర్, బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ రిటైర్డ్ ఉద్యోగి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

