AR Rahman: భార్య సైరాకు బ్రేకప్ చెప్పిన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్
AR Rahman: గాఢమైన వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేశాడు ఏఆర్ రెహ్మాన్. భార్య సైరాతో విడిపోతున్నట్లు పేర్కొన్నాడు మ్యూజిక్ డైరెక్టర్. వైవాహిక బంధం 30 ఏళ్లు నిండితుందని ఆశించినా.. తమ హృదయాలు ముక్కలైనట్లు చెప్పాడు.
ముంబై: ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్(AR Rahman).. తన భార్య సైరాకు బ్రేకప్ చెప్పేశారు. తమ బంధానికి ముప్పై ఏళ్లు నిండుతుందని ఆశించానని, కానీ ఆ బంధానికి ముందే బ్రేకప్ చెప్పేస్తున్నట్లు ఆయన తెలిపారు. పగిలిన హృదయాలను ఆ దేవుడు కూడా మోయలేడని రెహ్మాన్ తన ఎక్స్ అకౌంట్లో అభిప్రాయపడ్డారు. పగిలిన హృదయాలు మళ్లీ అతకవని, అయినా కానీ ఓ అర్ధాన్ని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. చాలా బలహీనమైన దశలో తమ బంధం ఉందని, మా ప్రైవసీని గౌరవించిన మిత్రులకు థ్యాంక్స్ చెబుతున్నట్లు రెహ్మాన్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
“We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for…
— A.R.Rahman (@arrahman) November 19, 2024
రెహ్మాన్, సైరా బ్రేకప్ గురించి లాయర్ సంయుక్త ప్రకటన చేశారు. ఒకర్ని ఒకరు విడిపోవాలన్న నిర్ణయాన్ని ఆ జంట తీసుకున్నట్లు లాయర్ వెల్లడించారు. వైవాహిక బంధంలో ఏర్పడిన భావోద్వేగ క్షణం తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆ లాయర్ చెప్పారు. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నా.. ఉద్రిక్తలు, ఆందోళనలు వారి మధ్య గ్యాప్‌ను పెంచేశాయని తెలిపారు. అయితే ఆ అగాధాన్ని పూడ్చేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరన్నారు.
రెహ్మాన్, సైరాలు 1995లో పెళ్లి చేసుకున్నారు. ఆ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఖతిజా, రహీమా, అమీన్. తమ ప్రైవసీని గౌరవించాలని కోరుతూ అమీన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి మ్యూజిక్ అందించిన రెహ్మాన్‌కు ఆస్కార్ అవార్డు దక్కింది. ఆ సమయంలో మోజార్ట్ ఆఫ్ మద్రాస్‌గా టైం మ్యాగ్జిన్ ఆయన్ను కీర్తించింది.
1992లో రిలీజైన రోజా మూవీతో రెహ్మాన్ కెరీర్ టర్న్ అయ్యింది. పెద్దల కుదిర్చిన పెళ్లిని ఎలా చేసుకున్నారని 2012లో ఓ జర్నలిస్టు ఆయన్ను ప్రశ్న వేశారు. అయితే దానికి సమాధానం ఇస్తూ.. నిజం చెప్పాలంటే వధువును వెతుక్కునే టైం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. రంగీలా, బాంబే లాంటి చిత్రాలు చేస్తున్న సమయంలో చాలా బిజీగా ఉన్నానని, ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని, అప్పుడు నా వయసు 29 ఏళ్లు అని, పెళ్లి కూతుర్ని వెతికి పెట్టండి అని తన తల్లికి అప్పుడే చెప్పినట్లు రెహ్మాన్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నా భార్య చాలా సింపుల్‌గా ఉండాలని భావించానని, తన కెరీర్‌కు ట్రబుల్ రావొద్దని ఆశించానని, దాని వల్ల తన మ్యూజిక్‌పై దృష్టి పెట్టవచ్చు అనుకున్నానన్నాడు. ఓ సూఫీ క్షేత్రం వద్ద సైరా సోదరి తన తల్లికి పరిచయం అయ్యిందని, ఆ తర్వాత సైరాతో బంధం ఏర్పడిందన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

