Dhanush | కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ (Dhanush) రాయన్ సక్సెస్‌తో హీరో కమ్ డైరెక్టర్‌గా సూపర్ ఫాంలో కొనసాగుతున్నాడు. ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న కుబేర (Kubera). కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అంటూ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న ధనుష్ లుక్, కుబేర గ్లింప్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఎక్జయిటింగ్ న్యూస్‌ను షేర్ చేసింది ధనుష్ టీం. ఈ మూవీని ఫిబ్రవరి 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ టాలెంటెడ్ నటుడు కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్న మరో మూవీ ఇడ్లికడై (idlikadai). DD4గా వస్తోన్న ఈ చిత్రంలో నిత్యమీనన్ హీరోయిన్గా నటిస్తుంది.ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. ఆకాశ్ (డెబ్యూ) నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అరుణ్ విజయ్, సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. వీటితోపాటు ధనుష్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సినిమా NEEK. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లెక్కన ధనుష్ 2025 ఫస్ట్ హాఫ్‌ను మొత్తం టేకోవర్ చేసేశాడని అర్థమవుతోంది. ఇది ధనుష్ అభిమానులకు పండగే అని చెప్పాలి.
#Kubera – Aiming for Feb 21 Release..😲💥 #NEEK on Feb 14 And #IdliKadai on April 10..!! Looks like #Dhanush is Gonna Take over the First Half of 2025..🤝🔥 pic.twitter.com/L6cIKyB6sd
— Laxmi Kanth (@iammoviebuff007) November 20, 2024
Mammootty | మాలీవుడ్ మల్టీస్టారర్ కోసం శ్రీలంకలో మమ్ముట్టి, మోహన్ లాల్.. ఫొటోలు వైరల్
Theatre Reviews | ఇకపై థియేటర్ల ముందు రివ్యూలకు నో ఛాన్స్.. !
AR Rahman: భార్య సైరాకు బ్రేకప్ చెప్పిన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్
Bacchala Malli | ఆ తేదీనే బచ్చలమల్లి.. అల్లరి నరేశ్ రిలీజ్ లుక్ వచ్చేసింది