నిర్మాణాత్మక పోలీసింగ్‌పై దృష్టి
నిర్మాణాత్మక పోలీసింగ్‌పై దృష్టి సారించినట్లు రాష్ట్ర డీజీపీ బీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఖమ్మంజిల్లా పర్యటన సందర్భంగా ఆదివారం పోలీస్‌హెడ్ క్వార్టర్స్‌కు చేరుకున్న డీజీపీ సాయుధ పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌లు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్మించిన పోలీస్స్పోర్ట్స్ కాంప్లెక్స్, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గృహ భవనాలను డీజీపీ ప్రారంభించారు.
- డీజీపీ శివధర్‌రెడ్డి
- సైబర్‌నేరాలు, రోడ్డుభద్రత, మాదకద్రవ్యాల మూలాలపై నిఘా
- ఖమ్మంలో పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, గృహ భవనాలు ప్రారంభం
మామిళ్లగూడెం, మార్చి 1: నిర్మాణాత్మక పోలీసింగ్‌పై దృష్టి సారించినట్లు రాష్ట్ర డీజీపీ బీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఖమ్మంజిల్లా పర్యటన సందర్భంగా ఆదివారం పోలీస్‌హెడ్ క్వార్టర్స్‌కు చేరుకున్న డీజీపీ సాయుధ పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌లు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్మించిన పోలీస్స్పోర్ట్స్ కాంప్లెక్స్, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గృహ భవనాలను డీజీపీ ప్రారంభించారు.
అనంతరం పోలీస్ శిక్షణ కేంద్రంలో అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా నేర గణంకాలు, ముఖ్యకేసుల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రత చర్యలు, మహిళలు, శిశువుల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణపై చేపడుతున్న చర్యలపై క్షుణంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే మంచి పేరుందన్నారు.
ఇతర రాష్ర్టాలతో పోల్చితే నేరాల నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ముందువరుసలో ఉన్నామన్నారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాలు ఇప్పుడు తెలంగాణ సమాజం ముందున్న పెనుసవాళ్లని వాటి నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థలు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ దేశంలోనే అత్యుతన్నంగా పని చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ప్రసాదరావు, రామానుజం, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సారంగపాణి, శ్రీనివాసులు, మహేశ్, సర్వర్, సత్యనారాయణ, ఫణిందర్, సుశీల్‌సింగ్, నర్సయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

