Mahesh Babu | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) త్వరలోనే అభిమానులకు ఎస్ఎస్ఎంబీ 29 రూపంలో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందించేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి కాంపౌండ్ నుంచి వస్తోన్న ఈ మూవీ కోసం మేకోవర్ మార్చుకున్నాడు. సూపర్ స్టార్ నుంచి కొత్త అప్డేట్ ఏమైనా వస్తుందా.. ? అని ఎదురుచూస్తున్న అభిమానుల్లో కొత్త స్టిల్ జోష్ నింపుతోంది.
మహేశ్ బాబు తాజాగా షూటింగ్లో పాల్గొన్నాడు. ఇంతకీ ఈ షూట్ సినిమా కోసమంటున్నారా.. కాదు.. యాడ్ కోసం ఇలా ఫ్రెష్ లుక్‌లోకి మారిపోయాడు. టీ షర్ట్ అండ్ జీన్స్ కాంబోలో స్టైలిష్ లాంగ్ కర్లీ హెయిర్‌తో యాడ్ షూట్ మెంబర్‌తో చిరునవ్వులు చిందిస్తున్న లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మహేశ్ బాబు చేసే యాడ్స్‌కు సూపర్ క్రేజ్ ఉంటుందని తెలిసిందే. మరి ఈ సారి ఏ వాణిజ్య ప్రకటనలో కనిపించబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. మహేశ్ బాబు తాజా ఫొటో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
ఎస్ఎస్ఎంబీ 29 2025 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ రూ.1000 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కనుండగా.. హాలీవుడ్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగం కాబోతున్నారని సమాచారం.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచరస్ రైడ్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.
SUPERSTAR @urstrulyMahesh from Latest ad shoot 🤩
Look matram 🔥❤️🔥#SSMB29 pic.twitter.com/6vu2tbn3iu
— Maheshbabu Fan Club (@MaheshBabu_FC) November 20, 2024
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
UI The Movie | ఉపేంద్ర యూఐ తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు
Mammootty | మాలీవుడ్ మల్టీస్టారర్ కోసం శ్రీలంకలో మమ్ముట్టి, మోహన్ లాల్.. ఫొటోలు వైరల్
Theatre Reviews | ఇకపై థియేటర్ల ముందు రివ్యూలకు నో ఛాన్స్.. !