RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) త్వరలోనే గేమ్ ఛేంజర్ (Game Changer)తో అభిమానులు, మూవీ లవర్స్‌కు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే ఆర్సీ 16కు సంబంధించిన వార్తలను పంచుకుంటూ అభిమానుల్లో జోష్ నింపుతోంది రాంచరణ్ టీం. తాజాగా ఆర్సీ 16 షూటింగ్ అప్డేట్ను షేర్ చేశాడు డైరెక్టర్ బుచ్చి బాబు సాన (Buchi Babu Sana).
ఇది చాలా ముఖ్యమైన రోజు. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న క్షణం. మైసూరులోని ఛాముండేశ్వరి మాత ఆశీస్సులతో మొదలు.. మీ దీవెనలు కావాలి.. అంటూ చేతిలో స్క్రిప్ట్ పట్టుకుని గుడి ముందు దిగిన ఫొటోను ఎక్స్ ద్వారా షేర్ చేశాడు బుచ్చి బాబు. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం కొన్ని రోజుల క్రితం రాంచరణ్ బ్లాక్ టీ షర్ట్ అండ్ షార్ట్‌లో యెల్లో గ్రీన్ షూ వేసుకుని.. ఫిట్నెస్ కోచ్ శివోహంతో ఉన్న స్టిల్‌ను షేర్ చేస్తూ బీస్ట్ మోడ్ ఆన్.. అంటూ షేర్ చేసిన స్టిల్ నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ మూవీకి తంగలాన్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏగన్ ఏకాంబరం పనిచేయబోతున్నాడు. ఆర్సీ 16లో కథానుగుణంగా రాంచరణ్ ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడనున్నాడట. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్సీ 16 మూవీకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన..
It’s a BIG DAY….
The most awaited moment 🤗🤗🤗
Started with the blessings of Chamundeshwari Matha, Mysore 🙏🏼🙏🏼🙏🏼Blessings needed 🤍🤗🙏🏼#RC16 pic.twitter.com/fPnEgZRxeT
— BuchiBabuSana (@BuchiBabuSana) November 22, 2024
Ram Charan | అయ్యప్పమాలలో దర్గాకు రాంచరణ్.. క్షమాపణ చెప్పాలని అయ్యప్ప భక్తుల డిమాండ్
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు