గూడు చెదిరిన పక్షులు
కొట్టడమో నిలువునా చంపడమో హింసంటే ఎట్లా? స్వేదంతో రక్తంతో త్యాగ రంజితమైన పక్షి గూళ్లను కూల్చడమూ నిర్ద్వంద్వంగా సామూహిక హింసనే
కొట్టడమో
నిలువునా చంపడమో
హింసంటే ఎట్లా?
స్వేదంతో రక్తంతో
త్యాగ రంజితమైన
పక్షి గూళ్లను కూల్చడమూ
నిర్ద్వంద్వంగా
సామూహిక హింసనే!
తుపాను రాలేదు
భూకంపమసలే లేదు
అర్ధరాత్రో అపరాత్రో
ఇండ్లు ఖాళీ చేయించి
కొంపలు కూల్చడం
క్రూరత్వానికి పరాకాష్ఠ!
ఈ విధ్వంసపు పునాదుల మీద
ఆకాశమెత్తు నిలబడే
ఆ అహింసామూర్తి
దుఃఖాన్నెవరు ఊహిస్తారు?!
చచ్చేదాకా సర్కారు వసతులున్న
త్యాగాల కుటుంబానికి
నిలువ నీడ లేదని
వగచే నాయకులారా
గూడు చెదిరిన పక్షులు
గుంపులు గుంపులుగా
ఏకమవుతున్నాయి!
-కోట్ల వెంకటేశ్వరరెడ్డి
94402 33261
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

