Telangana | కాగితాల్లోనే ‘కారుణ్యం’.. హోంశాఖలో వందలాది హోంగార్డుల ఎదురుచూపు
Telangana | అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ వెనుకాడుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న రే వంత్‌రెడ్డి మాట్లాడుతూ..‘హోంగార్డులకు బీఆర్ఎస్ ప్రభుత్వం భిక్షమేస్తున్నది..
Telangana | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ వెనుకాడుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న రే వంత్‌రెడ్డి మాట్లాడుతూ..‘హోంగార్డులకు బీఆర్ఎస్ ప్రభుత్వం భిక్షమేస్తున్నది.. మేం అ ధికారంలోకి వస్తే వారిని పర్మినెంట్ చేస్తాం.. 2016నుంచి మృతిచెందిన 800మంది హోం గార్డుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పి స్తాం’ అని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆశలను వమ్ముచేసింది. మంత్రులకు పలుమార్లు వి న్నవించినా, ప్రజాభవన్‌లోని గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే దిక్కు లేదని ఆందోళన చెందుతున్నారు.
మోసగించిన కాంగ్రెస్ సర్కార్
కారుణ్య నియామకాల విషయంలో కాంగ్రె స్ ప్రభుత్వం తమను తీవ్రంగా మోసగించిందనే ఆవేదనలో ఉన్న హోంగార్డులకు.. సరిగ్గా మూడు నెలల క్రితం డీజీపీ శివధర్‌రెడ్డితో ప్రకటన చేయించి ఆశలు రేకెత్తించింది. నిరుడు డిసెంబర్ 6న హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా డీజీపీ సందేశమిస్తూ.. ‘హోంగార్డులకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
ముఖ్యంగా కారుణ్య నియామకాలకు సంబంధించిన అంశం త్వర లో పరిషరించాల్సి ఉన్నది. విధి నిర్వహణ లో చనిపోయిన హోంగార్డులకు శ్రద్ధాంజలి కా ర్యక్రమం తరహాలో ఈ కారుణ్య నియామకా లు చేపట్టాల్సి ఉంది. దీంతోపాటు అతి త్వరలోనే హోంగార్డులు కొన్ని ప్రభుత్వ నిర్ణయాలపై శుభవార్త వింటారు’ అని పేర్కొన్నారు. ఇలా ప్రకటించి మూడు నెలలవుతున్నా నేటికీ, ఆ ప్రక్రియ కాగితాలపైనే ఉన్నదని హోంగార్డులు ఆవేదన చెందున్నారు.
కాగితాలకే పరిమితమైన జీవోలు..
యూనిఫామ్ అలవెన్స్, బందోబస్తుకు డైట్ చార్జీలు, రాష్ట్ర ప్రభుత్వం సహజ మరణానికి రూ.5లక్షలు ఇస్తున్నట్టు జీవో 2ను 2025లో విడుదల చేసింది. ఇప్పటివరకు ఆ పరిహారం అందలేదు. గతిలేక జిల్లాలలోని పోలీసు కా ర్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 2025 నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా మరణించిన హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా కింద 23 మందికి రూ.1.15 కోట్లు విడుదల చేసినట్టు సమాచారం. 4 నెలలు గడుస్తున్నా బాధితులకు అందలేదు. ఇదే వరుసలో పరిహారం కోసం ఎదురుచూస్తున్న వారు దాదాపు 80 మంది వరకు ఉన్నట్టు సమాచారం. ఇక ‘హోంగార్డులకు హెల్త్‌కార్డులు’ అంటూ ఇ చ్చి న మరో హామీపై ప్రస్తావన లేదు. విరమణ పొందిన హోంగార్డులకు ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదని వాపోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

