‘స్త్రీ లేకపోతే మానవ మనుగడే లేదు’
మానవ మనుగడకు మూలాధారం, సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీలను సమస్థానంతో గౌరవించాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పాఠశాలలో నిర్వహించిన..
రుద్రంపూర్, మార్చి 07 : మానవ మనుగడకు మూలాధారం, సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీలను సమస్థానంతో గౌరవించాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక స్త్రీ తల్లిగా జన్మనిస్తుంది. తన సుఖసంతోషాలు త్యాగం చేసి కుటుంబ బాగోగులు చూస్తుంది. అక్కా, చెల్లిగా ప్రేమను పంచి, భార్యగా ఇంటి బాగోగులు చూస్తూ, కూతురిగా ఆనందాలు పంచే మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో రాణింగలమని నేడు స్త్రీలు నిరుపిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి లో స్త్రీలకు అత్యుత్తమ స్థానం ప్రస్తావించబడిందన్నారు. కాగా నేటి ఆధునిక యుగంలో కూడా స్త్రీలు ఇంకా వివక్షకు గురవుతున్నారంటే అది చాలా దురదృష్టకరమైన విషయం అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండే స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పర్వీన్ సుల్తానా, లక్ష్మీ ప్రసన్న, సరస్వతి, నుసరత్, జేఫీషా, విజయలక్ష్మి, శిరీషా, నీల, సల్మా, నాజీయ సుల్తానా, సుహాన, ఖాజా పాల్గొన్నారు.

‘స్త్రీ లేకపోతే మానవ మనుగడే లేదు’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

