Rashmika Mandanna | టాలీవుడ్లో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబోలో టాప్‌లో ఉంటుంది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)-రష్మిక మందన్నా (Rashmika Mandanna). గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ ఇద్దరు ఆఫ్ స్క్రీన్‌లో కూడా సూపర్ బాండింగ్ మెయింటైన్ చేస్తుంటారని తెలిసిందే. ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూ నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. ఈ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని చాలా కాలంగా నెట్టింట చర్చ నడుస్తుంది. అయితే దీనిపై మాత్రం అటు రష్మికకానీ, ఇటు విజయ్ దేవరకొండ కానీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.
అభిమానుల్లో నెలకొన్న డైలామాకు రష్మిక మందన్నా చెక్ పెట్టేసింది. చెన్నైలో జరిగిన పుష్ప 2 వేడుకలో తన రిలేషన్ షిప్ స్టేటస్‌పై ఓపెన్ అయిపోయింది కన్నడ సోయగం. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు..? అతడు ఇండస్ట్రీ చెందిన వాడేనా..? అని యాంకర్ అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అతడెవరో అందరికీ తెలుసునని చెప్పింది. రష్మిక సమాధానంతో ఆడిటోరియం అంతా అరుపులు,కేకలతో దద్దరిల్లిపోయింది. విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్‌షిప్‌పై చాలా కాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు తాజా కామెంట్స్‌తో ఫుల్ స్టాప్ పెట్టేసింది రష్మికమందన్నా.
మరోవైపు ఇటీవలే తాను డేటింగ్లో ఉన్నానని, ఇప్పుడు తన వయస్సు 35 ఏండ్లు. ఇంకా సింగిల్‌గా ఉండమంటారా..? అందరం ఏదో ఒకటైంలో పెళ్లి చేసుకోవాల్సిందే..అంటూ రిలేషన్షిప్ గురించి హింట్ ఇచ్చేశాడు విజయ్ దేవరకొండ. ఈ లెక్కన త్వరలోనే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెండ్లిపై క్లారిటీ వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు సినీ జనాలు.
Jr NTR | హిందీలో రెండో సినిమా.. ఆ అగ్రిమెంట్‌పై తారక్ సైన్ చేశాడా ఏంటీ..?
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్