Jr NTR | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్ వార్ 2తో బాలీవుడ్ (Bollywood) ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ మరో లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ సినిమా విడుదల కాకముందే తారక్ మరో హిందీ సినిమాకు సంతకం చేశాడన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజా టాక్ ప్రకారం యశ్ రాజ్ ఫిలిమ్స్‌తో తారక్ మరో భారీ సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడని బీటౌన్ సర్కిల్లో ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు చెప్పిన కథ తారక్‌కు నచ్చిందట. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే 2025 చివరలో ఈ సినిమా లాంచ్ కాబోతుందట. ప్రస్తుతానికి ఆ డైరెక్టర్ ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ తరచూ స్టార్ యాక్టర్లలో మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకుంటుందని తెలిసిందే. మరి ఎన్టీఆర్ కూడా ఇలాంటి అగ్రిమెంట్‌కు సంతకం ఏమైనా చేశాడా..? అన్నది తెలియాల్సి ఉంది.
మొత్తానికి ఏదేమైనా తారక్ త్వరలో హిందీలో రెండో సినిమాకు సైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడన్నది మాత్రం నిజమేనని తాజా వార్తలు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్ డమ్ సంపాదించుకున్న తారక్ ఇక హిందీలో కూడా తన సత్తా చూపించాలని డిసైడ్ అయినట్టు తాజా న్యూస్ హింట్ ఇచ్చేస్తుంది.
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన