Sritej | ప్రముఖ సినీ నటుడు శ్రీతేజ్ (Sritej)పై కూకట్పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీతేజ్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శ్రీతేజ్‌పై బీఎన్ఎన్ (Bharatiya Nyaya Sanhita) 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీతేజ్‌పై గతంలో కూడా ఇదే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీతేజ్ పెళ్లైయిన మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. అక్రమ సంబంధం విషయం తెలిసి గుండెపోటుతో అప్పట్లో బ్యాంక్ ఉద్యోగి సురేశ్ మృతి చెందాడు. బ్యాంక్ ఉద్యోగి మృతితో గతంలో మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, పుష్ప ది రైజ్, మంగళవారం, ధమాకా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీతేజ్ ప్రస్తుతం పుష్ప ది రూల్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Vetrimaaran | వెట్రిమారన్ డబుల్ ట్రీట్.. విడుదల పార్ట్ 2 ట్రైలర్, ఆడియో లాంచ్ టైం ఫిక్స్
Devi Sri Prasad | ఎవరూ క్రెడిట్ ఇవ్వరు.. హాట్ టాపిక్‌గా పుష్ప నిర్మాతలపై డీఎస్పీ కామెంట్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా