Sandeham | కుమారి 21ఎఫ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది హెబ్బా పటేల్ (hebah patel). ఈ ముంబై భామ ఆ తర్వాత నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో మాత్రం ఈ భామ నటిస్తోన్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్, వ్యవస్థ ట్రెండింగ్‌లో నిలుస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి.
తాజాగా ఇదే లైన్లో వెళ్తోంది సందేహం (Sandeham). ఊరికి ఉత్తరాన ఫేం సతీశ్ పరంవేద డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో మంచి స్పందన రాబట్టుకోగా.. థ్రిల్లింగ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ మూవీ రీసెంట్గా ఈటీవీ విన్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ వారం విడుదలైన సినిమాల్లో సందేహం ముందు వరుసలో నిలిచి ట్రెండింగ్ అవుతోంది. విష్ణు వర్షిని క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ తెరకెక్కించిన ఈ మూవీలో శ్వేతావర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ బోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ రావు ఇతర కీ రోల్స్ పోషించారు. ప్రేమ, నమ్మకం, షాకింగ్ ట్విస్టుల నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేయండి.
Experience rollercoaster of emotions! ❤️#Sandeham Streaming on @etvwin will keep you on the edge of your seat with love, trust, and shocking twists 💥
Enjoy a thrilling weekend with the whole familyhttps://t.co/lmECm05ePo@sumanvootkur @ihebahp@VV_Creations_… pic.twitter.com/NozMl6dmeW
— Ramesh Bala (@rameshlaus) December 1, 2024
Trisha | గెట్ రెడీ.. డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న త్రిష
Bloody Beggar | బ్లడీ బెగ్గర్ ఓటీటీలోకి వచ్చేశాడు.. కవిన్ సందడి చేసే పాపులర్ ప్లాట్‌ఫాం ఇదే