మా గోడు పట్టించుకోండి.. నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించండి
తాము నిత్యం విష కీటకాలతో సహవాసం చేస్తున్నామని, తమ గోడు పట్టించుకోవాలని నారాయణపూర్ గ్రామస్తులు వేడుకున్నారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోని చావడి వద్ద నిరసన తెలిపారు.
- నిత్యం విషకీటకాలతో సహవాసం చేస్తున్నాం
- ఎమ్మెల్యే సత్యం హామీ ఇచ్చి మరిచిపోయిండు
- నారాయణపూర్ గ్రామస్తుల ఆందోళన
గంగాధర, మార్చి 13 : తాము నిత్యం విష కీటకాలతో సహవాసం చేస్తున్నామని, తమ గోడు పట్టించుకోవాలని నారాయణపూర్ గ్రామస్తులు వేడుకున్నారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోని చావడి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, 20 ఏళ్లుగా నారాయణపూర్ రిజర్వాయర్‌తో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం సర్వే చేసి కేవలం 27 ఇండ్లను మాత్రమే ముంపు కింద తీసుకుందని, కట్టకు మరమ్మతులు చేసి ఎత్తు పెంచే పనులు కూడా అధికారులు ప్రారంచారని తెలిపారు. ఇప్పటికే రిజర్వాయర్‌తో ఇబ్బందులు పడుతుంటే, కట్ట ఎత్తు మరింత పెంచి తమను మరింత కష్టాల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. రిజర్వాయర్ నిండిన ప్రతిసారి కట్ట జాలు పట్టి ఇండ్ల గోడలు పదునెక్కి ఎప్పుడు కూలుతాయే తెలియక బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తాను గెలిచాక ఆరు నెలల్లో రిజర్వాయర్ సమస్యను పరిష్కరించి, గ్రామస్తులకు నాయ్యం చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
భూములకు నష్టమైతంది
నారాయణపూర్ రిజర్వాయర్‌తో మా భూములకు నష్టమైతంది. మా బాధలు ఎవ్వలు పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఊరికి వచ్చిండు. కట్టను పరిశీలించి, సమస్య పెద్దగా ఉంది, ఊరిని మొత్తం ముంపు కింద తీసుకోవాలసిందే అని చెప్పిండు. ఇప్పడు ఏం సప్పుడుజేత్తలేడు. మా నారాయణపూర్ ఊరు మొత్తాన్ని తీసుకుని పరిహారం అందజేయాలని ఎమ్మెల్యే, అధికారులకు దండంపెట్టి కోరుతున్నం.
-సాయిళ్ల శ్రీనివాస్
ఇండ్లకే పరిహారం ఇస్తున్నరు
నారాయణపూర్ రిజార్వయర్ కింద కేవలం 27 ఇండ్లకు మాత్రమే పరిహారం ఇస్తున్నట్లు తెలిసింది. వాటితో పాటు మా మొత్తం గ్రామాన్ని కూడా ముంపు గ్రామంగా తీసుకోవాలి. వానకాలంలో రిజర్వాయర్ కట్ట తెగినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా గడిపినం. చుట్టూ నీళ్లు, నీళ్ల మధ్యల మేం. రాత్రంతా జాగారం చేసినం. ఇసొంటి కష్టాలు ఎవ్వలకు రావద్దు.
– గుర్రం భారతి
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

