Bloody Beggar | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే అతికొద్ది మంది కోలీవుడ్ యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు కవిన్. ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్లో నటించిన సినిమా బ్లడీ బెగ్గర్ (Bloody Beggar). శివ బాలన్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించాడు. Filament Pictures బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కాగా.. మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారి కోసం ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించిన ప్రకారం బ్లడీ బెగ్గర్ నేడు పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయింది. ప్రస్తుతం తమిళంలో స్ట్రీమింగ్ అవుతుండగా.. త్వరలోనే మేకర్స్ తెలుగు వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారని ఇన్సైడ్ టాక్. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించాడు. బ్లడీ బెగ్గర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తొలి ప్రొడక్షన్ వెంచర్ కావడం విశేషం.
a rags to riches story tainted with blood, comedy & a haunting past 🔪#BloodyBeggarOnPrime, watch now: https://t.co/t84fQbmZkD pic.twitter.com/XCKVUh2nhI
— prime video IN (@PrimeVideoIN) November 28, 2024
THE PARADISE | నానితో కలెక్షన్ కింగ్ ఫైట్.. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ క్రేజీ న్యూస్..!
Kiran Abbavaram | ఓటీటీలో కిరణ్ అబ్బవరం క చాలా స్పెషల్.. ఎందుకంటే..?
Jailer 2 | తలైవా బర్త్ డే స్పెషల్.. జైలర్ 2 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్