Idly Kadai | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) వరుస సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. ఓ వైపు హీరోగా, మరోవైపు డైరెక్టర్‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ స్టార్ యాక్టర్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ఇడ్లీ కడై (IdlyKadai). DD4గా వస్తోన్నీ చిత్రాన్ని ఆకాశ్ (డెబ్యూ) నిర్మిస్తున్నాడు.
ఈ చిత్రం నుంచి లాంచ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో ధనుష్ లుక్ ఎలా ఉండబోతుందో తెలియజేసే వీడియో ఒకటి ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. ధనుష్ క్లీన్ షేవ్‌తో డీగ్లామరస్‌గా కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ యంగ్ లుక్‌లోకి మారిపోతున్నాడు.. అంటూ తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు, ఫాలోవర్లు. రాయన్ తర్వాత మరోసారి ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని ఇప్పటివరకు వచ్చిన లుక్స్ చెప్పకనే చెబుతున్నాయి.
ఈ చిత్రంలో నిత్యమీనన్ హీరోయిన్గా నటిస్తుండగా.. అరుణ్ విజయ్, సత్యరాజ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ధనుష్ మరోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కుబేరలో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది.
CROWD PULLER @dhanushkraja 🔥#IdlyKadai pic.twitter.com/8B5eNaUeqz
— Dhanush Trends ™ (@Dhanush_Trends) November 30, 2024
Surrounded Fans ❤️ @dhanushkraja sir ! #Dhanush #IdlyKadai #Dhanush new clean shaven look 🔥🔥❤️😲 #IdliKadai pic.twitter.com/xi0qessX6X
— smritigit Paul (@smritigit_pal) November 30, 2024
Sandeham | ఓటీటీలో హెబ్బా పటేల్ ఫీవర్.. ట్రెండింగ్‌లో సందేహం
Trisha | గెట్ రెడీ.. డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న త్రిష