Allu Arjun | అల్లు అర్జున్ టైటిల్ రోల్లో నటించిన ప్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జీవో చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు అల్లు అర్జున్.
ఈ నిర్ణయం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను తెలియజేస్తుంది. ప్రత్యేకించి ఏపీ సీఎం చంద్రబాబుకు, సినీ ఇండస్ట్రీని బలోపేతం చేయడంలో సహకారం అందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు బన్నీ. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే లాంచ్ చేసిన పుష్ప పుష్ప పుష్ప సాంగ్, సూసేకి, కిస్సిక్, పీలింగ్స్ పాటలు కూడా బ్లాక్ బస్టర్ టాక్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి.
I extend my heartfelt thanks to the Government of Andhra Pradesh for approving the ticket hike. This progressive decision demonstrates your steadfast commitment to the growth and prosperity of the Telugu film industry.
A special note of thanks to the Hon’ble @AndhraPradeshCM,…
— Allu Arjun (@alluarjun) December 2, 2024
Read Also :
Raja Saab | రాజాసాబ్ టీజర్, మాస్ సాంగ్ వచ్చేస్తున్నాయి.. ప్రభాస్ ఫ్యాన్స్ రెడీనా..?
Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట