ఆదిలాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాలను తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అ ధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ విమర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులపై పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టంచేశారు. బుధవారం ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలుతో కలిసి గెల్లు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమన్ ఆరోగ్య విషయంలో ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సుమన్‌కు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
రవీంద్రభారతి, ఫిబ్రవరి 25 : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని బీసీ జే ఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య డి మాండ్ చేశారు. బుధవారం బషీర్‌బాగ్ లో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. కుమ్మెరలో మల్లన్న జాతర సందర్భంగా అగ్రకులాల దాడిలో పసిపాప మృతిచెందిన ఘటనతో బీసీ సమాజం తీవ్ర ఆందోళనకు గురవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలాకాలోనే బీసీలపై దాడులు అత్యంత హేయమని మండిపడ్డారు. ఘటనపై పారదర్శక దర్యాప్తు జరుపాలని, అవసరమైతే సిట్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.