ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 25 : నాగర్ కర్నూల్లో చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్రూపునార్ డిమాండ్ చేశారు. బాలిక మృతికి నిరసనగా బుధవారం ఆసిఫాబాద్‌లో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ సక్సెస్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామానికి చెందిన చిన్నారి అగ్రకులాల అహంకారానికి బలైపోయిందని, ఇలాంటి ఘటనలు మానవ విలువలను కాలరాస్తాయని మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మండల రజక సంఘ అధ్యక్షుడు వేములవాడ గణపతి, తిర్యాణి రజక సంఘ మండల అధ్యక్షుడు రేగళ్ల రాజమౌళి, సభ్యులు రమేశ్, సాయి, రాములు, చిరంజీవి, అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
భీమారంలో
భీమారం, ఫిబ్రవరి 24 : నాగర్ కర్నూల్ జిల్లాలో బాలిక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం భీమారం మండలకేంద్రంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వర్తక, వాణిజ్య సముదాయాల నిర్వాహకులు బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. బాలిక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.