Raja Saab | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తొలిసారి హార్రర్ కామెడీ జోనర్లో చేస్తున్న సినిమా రాజాసాబ్ (raja saab). మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫినిషింగ్ టచ్‌లో ఉంది. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో అభిమానులకు విజువల్ ట్రీట్ అందించేందుకు రెడీ అవుతున్నాడని చెబుతోంది.
ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. తాజాగా రాజాసాబ్ టీజర్, మాస్ సాంగ్ అప్డేట్స్ వచ్చేశాయి. ఈ మూవీ టీజర్‌ను క్రిస్మస్ కానుకగా లాంచ్ చేయబోతుండగా.. మాస్ సాంగ్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 14న లాంచ్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఈ లెక్కన ప్రభాస్ అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్స్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారని తాజా వార్త క్లారిటీ ఇచ్చేస్తుంది.
రాజాసాబ్ మోషన్ పోస్టర్ ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ మూవీలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట
Harish Shankar | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. షోలే డైరెక్టర్‌తో హరీష్ శంకర్