Harish Shankar | 49 ఏండ్ల క్రితం సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేసి భారతీయ సినీ చరిత్రలో ఐకానిక్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచింది షోలే (Sholay). రమేశ్ షిప్పి (Ramesh Sippy) డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎంతమంది సెలబ్రిటీలను ప్రభావితం చేసిందో చెప్పడం కొంచెం కష్టమే. ఈ సినిమాను స్ఫూర్తి పొందినవారిలో టాలీవుడ్ నుంచి చాలా మంది డైరెక్టర్లుంటారు. వీరిలో ఒకడు హరీష్ శంకర్ (Harish Shankar) .
షోలేలో విలన్ పాత్రనే గబ్బర్ సింగ్ టైటిల్‌గా పెట్టి పవన్ కల్యాణ్‌తో ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు హరీష్ శంకర్. తన సినిమాలపై షోలే ప్రభావం చాలా ఉంటుందని చెప్తుండే ఈ దర్శకుడికి తన అభిమాన దర్శకుడు రమేశ్ షిప్పిని కలిసే అరుదైన అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు హరీష్ శంకర్. ఇప్పుడీ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతూ.. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి తన అభిమాన దర్శకుడు రమేశ్ షిప్పి.. చిట్ చాట్ చేయడం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఏడాది మిస్టర్ బచ్చన్ సినిమాతో ఊహించని ప్లాప్ మూటగట్టుకున్న హరీష్ శంకర్.. పవన్ కల్యాణ్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట