Chiru Odela Cinema | ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి (Chiranjeevi). సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. మరోవైపు దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అలా అప్డేట్ ఇచ్చేశారో లేదో..? సినిమా ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న అభిమానులకు స్టన్నింగ్ ఫొటోతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
మెగాస్టార్ చిరంజీవితో పిడికిలి బిగించిన స్టిల్‌ను షేర్ చేశాడు. బ్యాక్‌డ్రాప్‌లో చిరు, శ్రీకాంత్ ముఖాలను కనిపించకుండా.. నెత్తుటితో పిడికిలి బిగించిన స్టిల్‌ను హైలెట్ చేస్తూ తీసిన ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. సినిమా వయోలెన్స్‌గా (హింసాత్మకంగా) ఉండబోతుందని ట్వీట్ చేశాడు. ఒక్క స్టిల్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు.
శ్రీకాంత్ ఓదెల ఓ వైపు నానితో రెండో సినిమాను డైరెక్ట్ చేస్తూనే.. మరోవైపు మెగాస్టార్ సినిమాను లైన్లో పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. హై బడ్జెట్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టులో చిరంజీవిని చాలా ఫ్రెస్ లుక్‌తో నయా అవతార్‌లో చూపించబోతున్నాడట.
పిడికిలి బిగించిన చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల..
Good morning.#ChiruOdelaCinema will be VEHEMENTLY VIOLENT.#FANBOYTHANDAVAM 🔥 pic.twitter.com/fKkqOBLmmm
— Srikanth Odela (@odela_srikanth) December 4, 2024
They Call Him OG | ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా.. ట్విటర్‌లోకి ఓజీ డైరెక్టర్ గ్రాండ్ ఎంట్రీ
Daaku Maharaaj | బాలకృష్ణ డాకు మహారాజ్ ఫినిషింగ్ టచ్.. బాబీ టీం ఎక్జయిటింగ్ న్యూస్