Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ (Balakrishna) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఎన్బీకే 109 (NBK109)గా వస్తోన్న ఈ చిత్రానికి బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారని తెలిసిందే. కాగా విడుదలకు కొన్ని రోజులే మిగిలి ఉండటంతో ఇక బాబీ టీం ఫినిషింగ్ టచ్ ఇచ్చేసింది. డాకు మహారాజ్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ మరోసారి టీజర్‌ను ట్యాగ్ చేస్తూ వీడియో విడుదల చేశారు.
బాలకృష్ణను ఈ సారి కంప్లీట్ నయా అవతార్‌లో చూపించబోతున్నాడని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్లో.. ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు.. చీకటిని పంచే రాక్షసులది కాదు.. ఆ రాక్షసులనే ఆడించే రావణుడిది కాడు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది.. గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది.. నన్ను గుర్తు పట్టావా..? డాకు డాకు మహారాజ్ అంటూ బాలకృష్ణ స్టైల్ ఆఫ్ డైలాగ్స్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.
ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
The shoot of #DaakuMaharaaj is wrapped, We’re all set for the MASS STORM on big screens this Sankranthi! 🔥⚡️
Teaser – https://t.co/0GOKr5ma0Z
Brace yourselves for the ultimate 𝐏𝐨𝐰𝐞𝐫-𝐏𝐚𝐜𝐤𝐞𝐝 𝐌𝐀𝐒𝐒 𝐄𝐗𝐏𝐋𝐎𝐒𝐈𝐎𝐍 n Jan 12, 2025 in Cinemas Worldwide. 🤙🏻🔥
𝑮𝑶𝑫… pic.twitter.com/FpAlQ0Ef4g
— BA Raju’s Team (@baraju_SuperHit) December 3, 2024
డాకు మహారాజ్ టైటిల్ టీజర్..
Rishab Shetty | శివాజీ మహారాజ్‌గా కాంతార హీరో.. రిషబ్ శెట్టి స్టన్నింగ్ లుక్ వైరల్
Allu Arjun | ఐదేళ్ల నుంచి ఒకే హీరోయిన్ : పుష్ప 2 ది రూల్ ఈవెంట్లో అల్లు అర్జున్