Allu Arjun | టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)- డైరెక్టర్ సుకుమార్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్.
ఈవెంట్లో అల్లు అర్జున్ శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్నా గురించి మాట్లాడిన మాటలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. ఈ సినిమా గురించి చెప్పాలంటే శ్రీవల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. గత ఐదేళ్ల నుంచి నేను పనిచేస్తున్న ఒకే ఒక హీరోయిన్ రష్మిక మందన్నా. నాకు ఈ అమ్మాయి తప్ప వేరే హీరోయిన్‌తో పనిచేసే అవకాశం లేకుండా పోయింది. అమ్మాయిలకు ప్రాముఖ్యత ఇవ్వడం చాలా ముఖ్యం.. మీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. రెండు రోజులు పీలింగ్స్ సాంగ్ షూట్ చేస్తున్నాం. మీరు నమ్మరు. దాదాపు రాత్రి 2 గంటలకు ప్యాకప్ అయితే.. మళ్లీ ఉదయాన్ని 8 గంటలకు సెట్‌కు రావాలి. నేనన్నా 8:50కి సెట్స్‌కు వచ్చా.. కానీ రష్మిక మాత్రం 8:30 గంటలకే సెట్‌కు వచ్చేసింది.
రెండు రోజులు కంటిన్యూగా షూట్ చేస్తే.. మూడో రోజు చెన్నై ఫంక్షన్లో ఆగి చూసినప్పుడు తన కండ్లంతా ఎర్రగా అయి పడుకోలేదు. వ్యక్తిగతంగా ఫీలయితే తప్ప ఏ ప్రొఫెషనల్ కూడా డే అండ్ నైట్ అంతలా కష్టపడరు. సినిమా కోసం రష్మిక ఐదేళ్లు పడ్డ కష్టం ఒక ఎత్తు.. చివరి 30 రోజులు మరొక ఎత్తు. ఇలాంటి అమ్మాయిలతో కదా మనం పనిచేయాల్సింది.. అంటూ రష్మిక మందన్నాను ఆకాశానికెత్తేశాడు అల్లు అర్జున్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read Also :
Allu Arjun | పుష్ప 2 ది రూల్‌కు సపోర్ట్.. ఏపీ ప్రభుత్వానికి అల్లు అర్జున్ ధన్యవాదాలు
Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట