Rishab Shetty | కాంతార సినిమాతో కన్నడ, తెలుగుతోపాటు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ బయోపిక్‌తో అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు. రిషబ్ శెట్టి నటిస్తోన్న బయోపిక్ శివాజీ మహారాజ్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఖడ్గం చేత బట్టిన శివాజీ మహారాజ్‌గా వీరత్వం ఉట్టిపడే లుక్‌లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు రిషబ్ శెట్టి. లెజెండరీ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ నేపథ్యంలో హిస్టారికల్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీని సందీప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని 2027 జనవరి 1న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇది సినిమా కంటే ఎక్కువగా ఉండబోతుంది.
అపారమైన అసమానతలను అధిగమించి.. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించి శాశ్వతమైన వారసత్వాన్ని సృష్టించిన యోధుడికి నివాళిగా వస్తోందని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
Our Honour & Privilege, Presenting the Epic Saga of India’s Greatest Warrior King – The Pride of Bharat: #ChhatrapatiShivajiMaharaj. #ThePrideOfBharatChhatrapatiShivajiMaharaj
This isn’t just a film – it’s a battle cry to honor a warrior who fought against all odds, challenged… pic.twitter.com/CeXO2K9H9Q
— Rishab Shetty (@shetty_rishab) December 3, 2024
Allu Arjun | ఐదేళ్ల నుంచి ఒకే హీరోయిన్ : పుష్ప 2 ది రూల్ ఈవెంట్లో అల్లు అర్జున్
Allu Arjun | పుష్ప 2 ది రూల్‌కు సపోర్ట్.. ఏపీ ప్రభుత్వానికి అల్లు అర్జున్ ధన్యవాదాలు