TheyCallHimOG | ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా.. పోకిరి సినిమాలోని ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా రోజుల తర్వాత ఈ డైలాగ్‌ను మరోసారి గుర్తు చేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ సుజిత్ (Sujeeth). ఏ సినిమా అప్డేట్ అయినా షేర్ చేసే ప్లాట్‌ఫాంలలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది సోషల్ మీడియా.
ఇటీవల కాలంలో సాధారణంగా హీరోలు, డైరెక్టర్లు తమ తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను నెట్టింట షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారని తెలిసిందే. అయితే నెట్టింట (ఎక్స్‌లో)అకౌంట్ లేకున్నా సూపర్ క్రేజ్ ఉన్న అతికొద్ది యువదర్శకుల్లో టాప్‌లో ఉంటాడు సుజిత్. రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు దర్శకుడు ప్రభాస్‌తో సాహో తెరకెక్కించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ఓజీ (TheyCallHimOG) తెరకెక్కిస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. మొత్తానికి ఫైనల్‌గా అభిమానులతో నేరుగా టచ్‌లోకి వచ్చేందుకు ట్విటర్ ( X ) లోకి ఎంట్రీ ఇచ్చేశాడు సుజిత్. ఎక్స్ అకౌంట్ కవర్ఫొటోపై ఓజీ స్టిల్‌ను పెట్టుకొని అభిమానుల్లో నయా జోష్ నింపుతున్నాడు సుజిత్.
ఈ సందర్భంగా సుజిత్‌కు గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు మూవీ లవర్స్, నెటిజన్లు. ఇంతకీ ఎక్స్ ఖాతాలో సుజిత్ ఫస్ట్ పోస్ట్ ఏం పెడతాడన్నది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఓజీ సినిమాతో ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా అనే డైలాగ్‌ను ఫుల్ ఫిల్ చేస్తాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
We are extremely elated to associate with @PawanKalyan Garu, for our next production.⚡️⭐️
Directed by @SujeethSign, DOP by @DOP007.#FirestormIsComing 🔥🔥 pic.twitter.com/Dd91Ik8sTK
— DVV Entertainment (@DVVMovies) December 4, 2022
Daaku Maharaaj | బాలకృష్ణ డాకు మహారాజ్ ఫినిషింగ్ టచ్.. బాబీ టీం ఎక్జయిటింగ్ న్యూస్
Allu Arjun | ఐదేళ్ల నుంచి ఒకే హీరోయిన్ : పుష్ప 2 ది రూల్ ఈవెంట్లో అల్లు అర్జున్