Allu Sirish | మెగా కుటుంబంలో ఇటీవల పెళ్లి సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, యంగ్ హీరో అల్లు శిరీష్ వివాహం నయనికాతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహించారు.. పెళ్లి తర్వాత కూడా ఈ జంట గురించి సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అల్లు శిరీష్ తన భార్య నయనికాతో కలిసి కొన్ని మధురమైన క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా తన చేతిపై భార్య నయనిక పేరును తెలుగులో రాసుకుని తీసుకున్న ఫోటోను షేర్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. భార్యపై ఉన్న ప్రేమను ఈ విధంగా వ్యక్తం చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతేకాదు, ఈ జంట మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపించేలా మరో క్యూట్ ఫోటోను కూడా శిరీష్ షేర్ చేశారు. ఈ చిత్రాల్లో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆనందం అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పోస్టుకు మెగా అభిమానులు, అల్లు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అల్లు శిరీష్ వివాహ వేడుక కూడా టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సహా అనేకమంది సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. మెగా మరియు అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసి ఈ వేడుకను మరింత ఘనంగా నిర్వహించారు.
మొత్తానికి పెళ్లి తర్వాత కూడా అల్లు శిరీష్, నయనిక జంట సోషల్ మీడియాలో తమ మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం శిరీష్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల నుంచి భారీ స్పందనను పొందుతున్నాయి.