కట్టంగూర్, మార్చి 12 : కట్టంగూర్ మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నీటి నిల్వ పనులను గురువారం జలసంచై-–జల భగీరధ ఇంపాక్ట్ స్టడీ బృందం సభ్యులు పరీశీలించారు. బృందం సభ్యులు నవనీత, రాచీగార్ల్, ప్రతీప్ కోరే డే కట్టంగూర్, ఈదులూరు, కల్మెర, పరడ గ్రామాల్లో చేపట్టిన నీటి సంరక్షణ పనులకు సందర్శించి వాటి ప్రభావాన్ని అంచనా వేశారు. సోక్‌పిట్, అమృత్ సరోవర్, ఓవర్ హెడ్ ట్యాంక్, చెక్ డ్యామ్, ఫారం పాండ్, చేపల చెరువు పనులను పరిశీలించి వాటి ప్రయోజనాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ నీటి నిల్వ పనుల వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ముక్కామల శ్యామల శేఖర్, తోటకూరి జలజ, కొలిపాక సురేందర్, ఇప్పలపల్లి అనిత, నకిరేకల్ క్లస్టర్ ఏపీడీ నర్సింహరావు, ఏపీఓ కడెం రాంమోహన్, ఈసీ శ్రీధర్, క్లస్టర్ టీఏ రమణ, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, పీల్ట్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.