హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో వెలుగుచూసిన ఫేక్ ఫైర్ సేఫ్టీ ఎన్వోసీల వ్యవహారంపై ఇంటర్మీడియట్ విద్యా మండలి(టీజీబీఐఈ) కఠిన నిర్ణయం తీసుకున్నది. నకిలీ, బోగస్ ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు సమర్పించిన ప్రతి ప్రైవేట్ జూనియర్ కాలేజీపై రూ.8 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు దాదాపు 45 కాలేజీలకు జరిమానా విధించినట్టు విశ్వసనీయ సమాచారం.