– నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 19 : విద్యలో రాణించాలే తమ పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ అన్నారు. శనివారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు బోధించే పాఠ్యాంశాలే కాకుండా ఇంటి వద్ద తమ పిల్లలకు అన్ని విషయాల్లో తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని, టీవీ, మొబైల్ ఫోన్కు దూరం ఉంచి చదువుపై శ్రద్ధ చూపేలా చూడాలన్నారు. స్వచ్ఛతకు సంబంధించి పాఠశాల విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు ఎంఈవో యదుసింహరాజు సమక్షంలో సర్పంచ్ సొంత ఖర్చుతో బహుమతులు అందజేశారు. గెలిచిన విజేతలకే కాకుండా పోటీలో ఉన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులు అందించారు. అనంతరం గ్రామంలో మరమ్మతులకు గురైన చేతి పంపులకు పంచాయతీ సిబ్బందితో మరమ్మతులు చేయించి అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చేకూరి రవి , పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.