కారేపల్లి, సెప్టెంబర్ 19 : సింగరేణి మండల పరిధిలోని శాంతి నగర్ కు చెందిన హనుమకొండ సతీష్ (40) నిజామాబాద్ జిల్లాలో ఏఆర్ ఆర్ఐ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 18న విధి నిర్వహణలో భాగంగా తన ఫిస్టల్ ను శుభ్రపరిచే క్రమంలో మిస్ ఫైర్ కాగా సతీష్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు సతీష్ అంత్యక్రియలు శనివారం స్వగ్రామమైన శాంతినగర్ లో జరిగాయి. నిజామాబాద్ ఏఆర్ ఏసిపి బి.కృష్ణ, ఏఆర్ ఆర్ఐ అడ్మిన్ డి.హరికుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐ, ఇతర సిబ్బంది దహన సంస్కారాలకు హాజరై పోలీస్ అధికారులు లాంచనాలతో నిర్వహించారు. అంతకు ముందు దహన సంస్కారాల ఖర్చులకు గాను మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా రూ.30 వేల చెక్కును అందజేశారు. సతీష్‌కు భార్య కళ్యాణి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు హనుమకొండ వెంకటేశ్వర్లు, తాటిపాముల సురేష్, పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు పెద్దబోయిన ఉమాశంకర్, అడపా పుల్లారావు, హనుమకొండ రమేష్, గుడిపూడి తిరుమలరావు పాల్గొన్నారు.