Sarpanches | పంచాయతీలకు ప్రభుత్వ నిధులు కేటాయించకపోవడంపై సర్పంచుల ఆగ్రహం
Sarpanches | గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కూడా మంజూరు చేయడం లేదని, ఇలా అయితే గ్రామాలు అభివృద్ధి పథంలోకి ఎలా ముందుకు వెళ్తాయని ధూళిమిట్ట మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ప్రశ్నించారు.
Sarpanches | మద్దూరు (ధూళిమిట్ట): గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంపై సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ధూళిమిట్ట మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన మండల సమీక్ష సమావేశంలో పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కూడా మంజూరు చేయడం లేదని, ఇలా అయితే గ్రామాలు అభివృద్ధి పథంలోకి ఎలా ముందుకు వెళ్తాయని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం నిధులకు కూడా జీపీడీపీ అని పెట్టి ఖర్చులు పెట్టనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేకపోవడం వల్ల గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించలేని దుస్థితిలో సర్పంచులు ఉన్నారని.. ఓట్లు వేసిన ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితులలో ప్రస్తుతం సర్పంచులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని దూళిమిట్ట మండల సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు నలగొప్పుల రేణుక రాములు, సర్పంచులు బర్మ రాజమల్లయ్య, దాసారం బాలకృష్ణ, చొప్పరి రామ్, మారెడ్డి నారాయణరెడ్డి, ధరావత్ రూపేష్ లు డిమాండ్ చేశారు.
Read Also :
Plank Exercise | రోజుకు 60 సెకన్ల పాటు ప్లాంక్ చేస్తే బీపీ తగ్గుతుంది.. నిపుణుల వెల్లడి..
RTC Elections | ఆర్టీసీలో ఎన్నికల నగారా.. 9న గుర్తింపు సంఘం ఎన్నికలు!
iPhone 18 Pro | బంగారం అమ్మి భార్యకు ఐఫోన్ 18ప్రో.. భారత్లో మొదలైన 18 సిరీస్ అమ్మకాలు..!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

