Shashi Tharoor | ఆంగ్ల భాషపై శశిథరూర్‌కు ఉన్న పట్టు అంతాఇంతా కాదు.. అయినా గ్రామర్ మిస్టేక్ చేశారు..!
Shashi Tharoor | ఆంగ్ల భాషపై కాంగ్రెస్ పార్టీ (Congress) సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ (MP Shashi Tharoor) కు ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడే తీరు, వాడే పదాలు, రచనా శైలి.. పాశ్చాత్య దేశాల (Western Countries) పండితులను సైతం మరిపిస్తాయి. అనేక సందర్భాల్లో ఆయన వాడిన పదాలు నెట్టింట్లో చర్చకు దారితీశాయి.
Shashi Tharoor : ఆంగ్ల భాషపై కాంగ్రెస్ పార్టీ (Congress) సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ (MP Shashi Tharoor) కు ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడే తీరు, వాడే పదాలు, రచనా శైలి.. పాశ్చాత్య దేశాల (Western Countries) పండితులను సైతం మరిపిస్తాయి. అనేక సందర్భాల్లో ఆయన వాడిన పదాలు నెట్టింట్లో చర్చకు దారితీశాయి. అంతటి పట్టున్న వ్యక్తి ఇంగ్లిష్‌లో తప్పు చేశాడంటే ఎవరైనా నమ్ముతారా..? కానీ అంతటి వ్యక్తి సైతం మిస్టేక్ చేశారు.
ప్రధాని నరేంద్రమోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ థరూర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లో ఓ చిన్న వ్యాకరణ దోషం దొర్లింది. దాన్ని నెటిజన్లు గుర్తించడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. సెప్టెంబర్ 17న మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా థరూర్ ‘ఎక్స్’ లో శుభాకాంక్షలు తెలిపారు. అయితే ‘ఆయన 76వ పుట్టినరోజు సందర్భంగా’ అనే అర్థం వచ్చేలా ‘on his 76th birthday’ అని రాయాల్సింది పోయి ‘in his 76th birthday’ అని రాశారు. దాంతో ఆ చిన్న తప్పిదం కాస్తా అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఆ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించారు. ఇది వ్యాకరణ తప్పిదమా..? టైపింగ్ పొరపాటా..? అంటూ చర్చించారు. కీబోర్డులో ‘I’, ‘O’ అక్షరాలు పక్కపక్కనే ఉండటంతో పొరపాటు జరిగి ఉండొచ్చని కొందరు సరదాగా చెప్పారు. మరికొందరు మాత్రం థరూర్ లాంటి ఇంగ్లిష్ పండితుడి నుంచి ఇలాంటి తప్పు రావడమే ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ విమర్శలను థరూర్ పట్టించుకోకుండా వదిలేయలేదు.
ఓ నెటిజన్ కామెంట్‌కు థరూర్ స్పందిస్తూ తన పొరపాటును స్వయంగా అంగీకరించారు. ‘ఆయన పుట్టినరోజు సందర్భంగా’ రాయాల్సిన చోట ‘in’ వచ్చిందని, ఇలాంటి పొరపాట్లు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయని సరదాగా బదులిచ్చారు. దాంతో ఈ చిన్న వ్యాకరణ పొరపాటు సోషల్ మీడియాలో సరదా చర్చగా మారింది. సాధారణంగా థరూర్ రాసే క్లిష్టమైన ఇంగ్లిష్ పదాల కంటే ఈసారి ఓ చిన్న పదమే అందరి దృష్టినీ ఆకర్షించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

