Rashmika Mandanna | టాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ, కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు రౌండప్ చేస్తూనే ఉన్నాయి. రీసెంట్గా పుష్ప 2 (Pushpa 2 The Rule) వేడుకలో తన రిలేషన్ షిప్ స్టేటస్‌పై అభిమానుల్లో నెలకొన్న డైలామాకు చెక్ కూడా పెట్టేసింది.
మీకిష్టమైన వ్యక్తి ఎవరు..? అతడు ఇండస్ట్రీ చెందిన వాడేనా..? అని యాంకర్ అని అడిగితే.. అతడెవరో అందరికీ తెలుసునని చెప్పింది. దీంతో అతడెవరో కాదు రౌడీ బాయ్ అని అందరికీ దాదాపు క్లారిటీ వచ్చేసినట్టైంది. కాగా ఇప్పుడీ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో థియేటర్లో ప్రత్యక్షమైంది. అది కూడా తాను హీరోయిన్గా నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా చూసింది.
హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్ అర్థరాత్రి పుష్ప 2 సినిమా చూసింది. ఇప్పుడీ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మొత్తానికి ఆనంద్ మీ నా ఫ్యామిలీ అంటూ గతంలోనే చెప్పిన రష్మిక.. రాబోయే రోజుల్లో దేవరకొండ ఫ్యామిలీ కోడలిగా మారడం దాదాపు ఖరారు అయిపోయినట్టేనని అప్పుడే నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు.
మరోవైపు తాను డేటింగ్లో ఉన్నానని, ఇప్పుడు తన వయస్సు 35 ఏండ్లు. ఇంకా సింగిల్‌గా ఉండమంటారా..? అందరం ఏదో ఒకటైంలో పెళ్లి చేసుకోవాల్సిందే..అంటూ రష్మిక మందన్నా పెండ్లిపై ఇటీవలే విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చేసినట్టేనని ఇప్పటికే నెట్టింట కథనాలు వైరల్ అవుతున్నాయి.
Fahadh Faasil | వెడ్డింగ్‌లో పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్.. ఇంతకీ ఎవరిదో తెలుసా..?
The Girlfriend | రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్‌కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?